14 Days Remand for Posani Krishnamurali : వైఎస్సార్సీపీ నేత, సినీ నటుడు పోసాని కృష్ణమురళికి కర్నూలులో న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌లపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో పోసానిపై కర్నూలు జిల్లా ఆదోని మూడో పట్టణ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు అయింది. దీంతో గుంటూరు జైలులో రిమాండ్‌గా ఉన్న పోసానిని తమకు అప్పగించాలని ఆదోని పోలీసులు జైలు సిబ్బందిని కోరారు. వారు అనుమతి ఇవ్వడంతో అదుపులోకి తీసుకొని వైద్య పరీక్షల అనంతరం పోసానిని కర్నూలుకు తరలించారు. అనంతరం న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు.
Category
🗞
News