• 3 days ago
  ఆస్ట్రేలియా పేరు మీద ఓ రికార్డు ఉంది. 14ఏళ్లుగా వాళ్లు ఐసీసీ నాకౌట్ మ్యాచుల్లో వాళ్లు టీమిండియా చేతిలో ఓడిపోలేదు. మరి ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్లో భారత్, ఆస్ట్రేలియా తలపడుతున్నాయి కాబట్టి ఈ రికార్డు ఈసారైనా బద్ధలు అవుతుందా లేదా సేఫ్ గా ఉంటుందా అనే చర్చ అన్ని చోట్లా జరుగుతోంది. అయితే ఆస్ట్రేలియా ఐసీసీ నాకౌట్ మ్యాచుల్లో భారత్ చేతిలో చివరిసారి ఓడిపోయిన సందర్భం 2011 వరల్డ్ కప్ లో. అప్పుడు టీమిండియా సెమీస్ లో ఆస్ట్రేలియాను ఓడించి ఫైనల్ కు చేరుకుంది.  2015 వరల్డ్ కప్ లో మనం ఆసీస్ చేతిలో సెమీస్ ఓడిపోయి ఇంటి దారి పట్టాం. ఆ ఏడాది విశ్వవిజేతగా నిలిచింది ఆస్ట్రేలియా. తిరిగి 2023 లో రెండు సార్లు మనం ఐసీసీ నాకౌట్ మ్యాచులు ఆడాడం. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్, ఇంకా 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్. ఈ రెండు సార్లు ఆస్ట్రేలియా టీమిండియాను ఓడించి ట్రోఫీలను కైవసం చేసుకుంది. సో ఈసారి మళ్లీ సెమీస్ లో ఈ రెండు టీమ్స్ తలపడుతున్నాయి కాబట్టి విజయం ఎవరిని వరిస్తుంది..ఆస్ట్రేలియా రికార్డును మనం బ్రేక్ చేస్తామా ఇప్పుడిదే టెన్షన్ పెంచుతోంది క్రికెట్ ఫ్యాన్స్ లో.

Category

🗞
News

Recommended