వరదా వాడిని ఆపు...అని సలార్ ను ఆపాలని వరదరాజమన్నార్ కి చెప్తారు కదా. అలాగే టీమిండియా ఐసీసీ టోర్నీల కలను చెదరగొడుతున్న ఓ కంగారూ బ్యాటర్ ఉన్నాడు. ఆయన పేరే ట్రావియెస్ హెడ్. సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఆడేప్పుడు ముద్దుగా హెడ్ మాస్టర్ అని హైదరాబాదీలు పిలుచుకునే ఈ ఆస్ట్రేలియన్ బ్యాటర్ గడచిన రెండేళ్ల కాలంలో మన చేతుల్లో నుంచి రెండు ఐసీసీ టోర్నీలు లాగేశాడు అంటే ఎగ్జాగరేషన్ కాదు. 2023 ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్. లండన్ లో మనోళ్లకు, ఆస్ట్రేలియాకు మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ట్రావియెస్ హెడ్ అడ్డం పడి మన విక్టరీని లాగేసుకున్నాడు. ఏకంగా 163 పరుగులు బాది టీమిండియా పై ఆస్ట్రేలియాకు 209 పరుగుల విక్టరీతో పాటు ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్ ట్రోఫీని కట్టబెట్టాడు. మళ్లీ అదే హెడ్ 2023 వన్డే వరల్డ్ కప్ లోనూ మన కలల్ని ఆశల్ని చిదిమేశాడు. మనోళ్లే కుయ్యో మొర్రో అంటూ 240 పరుగులు చేస్తే ఈ హెడ్మాస్టర్ ఫైనల్లో మనోళ్లను ఎడాపెడా కుమ్మేశాడు. 137పరుగులు బాది గ్రౌండ్ లో ఉన్న లక్షా 20 వేల అభిమానులను సైలెంట్ చేయటంతో పాటు వన్డే వరల్డ్ కప్ నూ లాగేసుకున్నాడు మన చేతుల్లో నుంచి. ఇప్పుడు అలాంటోడు మళ్లీ వస్తే అన్నట్లుంది పరిస్థితి. ఐసీసీ టోర్నీ ఫైనల్లో రెండుసార్లు మనకి తలనొప్పిలా మారిన హెడ్డు ఈ సారి సెమీస్ లో నే తగులుతున్నాడు టీమిండియా ఫ్యాన్స్ అదే ఆలోచనల్లో ఉన్నారు. వీలైనంత త్వరగా మన బౌలర్లు హెడ్ ని అవుట్ చేస్తే సగం భారం దిగిపోయినట్లే.
Category
🗞
News