ప్రధాని మోదీ మళ్లీ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ గా మారారు. ఈసారి వరల్డ్ వైల్డ్ లైఫ్ డే సందర్భంగా గుజరాత్ లోని గిర్ అభయారణ్యంకు వెళ్లిన ప్రధాని మోదీ అక్కడ లయన్ సఫారీ చేశారు. సఫారీ వెహికల్ ఎక్కి కెమెరా చేతపట్టుకుని అడవిలో తనకు కనిపించిన జంతువులు, పక్షుల ఫోటోలు తీశారు మోదీ. గిర్ అభయారణ్యం ఏసియాటిక్ సింహాలకు స్థావరం కాగా వాటిని మోదీ ఫోటోలు తీసి వరల్డ్ వైల్డ్ లైఫ్ డే సందర్భంగా పోస్ట్ చేశారు. వెహికల్ పైన ఎక్కిన మోదీ తనను బాగా ఆకట్టుకున్న జంతువులును ఫోటోలు తీయగా వాటిని ప్రధాన మంత్రి కార్యాలయం మోదీ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. జంతువులను అడవులను కాపాడాలని వన్య ప్రాణి సంరక్షణ మనుషులుగా మనం బాధ్యతతో వ్యవహరించాల్సి ఉందని ప్రధాని మోదీ అధికారులకు సూచించారు. గిర్ అభయారణ్యంలో ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల ను చేశారు
Category
🗞
News