వేగంగా గమ్యం చేరాలనే ఆత్రుత వాహనదారుల విచక్షణని గాడి తప్పిస్తోంది. యూటర్న్ తీసుకునేందుకు బద్ధకించి చాలామంది రాంగ్ రూట్‌లో దూసుకుపోతున్నారు. సిగ్నల్స్ దగ్గర వేచి ఉండటం సమయం వృథా అని భావించి నిబంధనలకు ఎదురెళ్తున్నారు. ఇలా ట్రాఫిక్ రూల్స్‌ని పట్టించుకోకుండా ప్రయాణించి గుంటూరులో చాలామంది నిత్యం ప్రమాదాల బారిన పడుతున్నారు. అతివేగంగా బైక్‌లు నడిపి ప్రాణాలు కోల్పోతున్నారు.
Category
🗞
News