• 3 weeks ago
A Man Died Of Heart Attack In Temple : ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలానికి చెందిన కె. విష్ణు వర్ధన్ 31, హైదరాబాద్​లోని కేపీహెచ్​బీ కాలనీలో ఓ హాస్టల్​లో ఉంటూ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. రోజూ గుడికి వెళ్లి ఆంజనేయుడిని దర్శించుకునే అలవాటు ఉంది. సోమవారం కూడా ఉదయం ఆలయానికి వచ్చి ప్రదక్షిణలు చేశాడు. ఆ తర్వాత ధ్యాన మందిరం మెట్లపై కూర్చుని సేదతీరాడు. కొంచెం ఇబ్బందిగా ఉండటంతో నీళ్లు తాగేందుకు ఫిల్టర్ దగ్గరకు వెళ్లి ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. భక్తులు సీపీఆర్ చేసి ఆస్పత్రికి తీసుకొని వెళ్లేలోపే మరణించాడు.

Category

🗞
News

Recommended