• last month
Heavy Rains In Hyderabad : హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో భాారీ వర్షం కురిసింది. భాగ్యనగరంతో పాటు నగర శివార్లలోనూ పలు ప్రాంతాల్లో వర్షం పడింది. కొండాపూర్​, మియాపూర్​, చందానగర్, లింగంపల్లిలో వర్షం దంచికొట్టింది. సాయంత్రం ఒక్కసారిగా మేఘావృతమై హైదర్​నగర్​, ఆల్విన్ కాలనీ, కేపీహెచ్‌బీకాలనీ ప్రాంతాల్లో జల్లులు కురిపించింది. మరోవైపు మూసాపేట్, నిజాంపేట్, ప్రగతినగర్‌, కుత్బుల్లాపూర్‌, మేడ్చల్, కండ్లకోయ, కృష్ణాపూర్, దుండిగల్, గండి మైసమ్మ, మల్లంపేట్ ప్రాంతాల్లో వర్షం కురిసింది. మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతంలో కొద్ది సేపట్లోనే భారీవర్షం పడింది. ఫలితంగా రహదారులపైకి భారీగా వాన నీరు చేరి ట్రాఫిక్​కు ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఆఫీసులు వదిలే సమయం కావడంతో రద్దీ పెరిగి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

Category

🗞
News

Recommended