అఖండ సినిమాలో కనిపించిన ఎద్దులు ఇవే

  • 3 years ago
అఖండ సినిమ రాయ‌ల‌సీమ పాత్ర‌ధారి ముర‌ళీకృష్ణ‌గా న‌టించిన బాల‌కృష్ణ పెంపుడు గిత్త‌లుగా క‌నిపించిన ఇవి.. హీరో ఇంట్ర‌డ‌క్ష‌న్‌, క్లైమాక్స్ సీన్స్‌, యాక్ష‌న్ స‌న్నివేశాల్లో ఆక‌ట్టుకున్నాయి. అస‌లు ఈ గిత్త‌లు ఎవ‌రివి? అని సందేహం రావ‌చ్చు. ఇవి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం లక్కవరం గ్రామానికి చెందిన శ్రీనివాస గౌడ్‌కు చెందిన గిత్తలు. వీటిని ఆయన 16 ఏళ్లుగా పెంచుతున్నారు. ఒంగోలు జాతికి చెందిన ఈ గిత్తలను బండలాగుడు పోటీలకు పంపుతుంటారు.