Kargil Vijay Diwas 2019:సైనికుల త్యాగాలను స్మరించుకుంటున్న భారతం|20th Anniversary Of Operation Vijay

  • 5 years ago
India is celebrating the 20th anniversary of the victory of the Indian Armed Forces in Operation Vijay over the infiltrating Pak troops. The anniversary is observed each year across the nation to show respect and gratitude to the brave servicemen of the armed forces who laid down their lives to re-capture all positions that had been closed by Pak Army.
#KargilVijayDiwas
#IndianArmedForces
#anniversary
#PakArmy
#ramnathkovind
#modi
#rajnathsingh


కార్గిల్‌ యుద్ధంలో విజయం సాధించి నేటికి 20 ఏళ్లు పూర్తి. ఆపరేషన్‌ విజయ్‌కి గుర్తుగా ఏటా జులై 26న కార్గిల్‌ దివస్‌ను జరుపుకుంటారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ట్విటర్‌ వేదికగా.. ఆనాటి అమరవీరులకు నివాళులర్పించారు. వారి త్యాగాన్ని దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని కొనియాడారు.‘‘కార్గిల్‌ దివస్‌.. కార్గిల్‌ యుద్ధంలో భారత సేనలు ప్రదర్శించిన అసమాన వీరత్వాన్ని గుర్తుచేసుకోవాల్సిన రోజు. ఈ సందర్భంగా.. దేశ రక్షణ కోసం తమ శౌర్యాన్ని, ధైర్యాన్ని ప్రదర్శించిన వీరులందరికీ వందనాలు సమర్పిస్తున్నాం. ఆ అమరులందరికీ మనం ఎప్పటికీ రుణపడి ఉంటాం’’ అని కోవింద్‌ ట్విటర్‌ వేదికగా అమరుల త్యాగాలను స్మరించుకున్నారు.