నిందితురాలిగా జగన్‌ సతీమణి భారతి పేరు

  • 6 years ago
In a major development in the illegal investments case of Y.S. Jagan Mohan Reddy, the ED has shown Bharathi, wife of Y.S. Jagan, as an in the Bharathi Cements case in the chargesheet filed before the Special CBI court of the city.
#andhrapradesh
#hyderabad
#ysjagan
#wife
#bharathi
#bharathicements


జగన్ అక్రమాస్తుల కేసులో వైసీపీ అధినేత వైఎస్ జగన్ సతీమణి భారతిని ఈడీ నిందితురాలిగా చేర్చింది. భారతి సిమెంట్స్ విషయంలో జరిగిన క్విడ్ ప్రొకో కేసులో వైఎస్ జగన్ తో పాటు భారతిని కూడా ముద్దాయిగా పేర్కొన్నారు. ఈ మేరకు సీబీఐ ప్రత్యేక కోర్టులో చార్జీషీటు దాఖాలు చేసింది.
ఈ కేసులో భారతి పేరు తొలిసారి చార్జీషీటులోకి ఎక్కడం గమనార్హం కాగా...ఈడీ చార్జీషీటును కోర్టు విచారణకు స్వీకరిస్తే నిందితులు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాల్సి ఉంటుంది. జగన్ పై సీబీఐ దాఖలు చేసిన 11 చార్జిషీట్లపై విచారణకోసం జగన్ ఇప్పటికే ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు భారతిపై దాఖలు చేసిన చార్జిషీటును కూడా కోర్టు స్వీకరిస్తే ఆమె కూడా వ్యక్తిగతంగా కోర్టు ఎదుట హాజరుకావాల్సి ఉంటుంది.

Category

🗞
News

Recommended