హాస్పిటల్ ఉన్నప్పుడు కరుణానిధి చూసిన సినిమా ఇది

  • 6 years ago
Rajinikanth's Baasha re-releases after 22 years, makers confident of positive response Rajinikanth's iconic 1995 film Baasha has been digitalised for its re-release.
#Rajinikanth
#Baasha
#nagma
#mkarunanidhi

ఈ బాషా ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్టే' అని బాషా చిత్రంలో సూపర్ స్టార్ రజనీకాంత్ చెప్పిన డైలాగ్‌తో దక్షిణాది సినిమా థియేటర్లు దద్దరిల్లాయి. ఆ డైలాగ్‌కు ప్రేక్షకులు పేపర్లు చింపి, ఈలలతో హోరెత్తించారు. 1995‌లో విడుదలైన బాషా చిత్రం బ్లాక్ బస్టర్‌గా చేసింది. రజనీకాంత్‌ను అందనంత ఆకాశానికి ఎత్తేసింది. అలాంటి ప్రజాదరణ, సంచలనాత్మక చిత్రం తాజాగా మరోసారి మార్చి 3 తేదీ శుక్రవారం మరోసారి విడుదలైంది.
రజనీ కెరీర్‌లోనే అత్యంత విజయం సాధించిన చిత్రంగా బాషా నిలిచింది. ముంబైలో డాన్‌గా ఉన్న బాషా సామాన్య జీవితం గడిపే వ్యక్తిగా ఎందుకు మారాడు అన్నది చిత్ర కథ. ఈ చిత్రంలో నగ్మా, రఘువరన్ ప్రధాన పాత్ర పోషించారు. ఈ చిత్రానికి దేవా సంగీతం అందించారు. ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికీ మీడియాలో మార్మోగుతున్నాయి.

Recommended