టాప్ జడ్జీల అసంతృప్తి.. లోయ కేసు విచారణలో అనూహ్య మార్పు

  • 6 years ago
A bench headed by Chief Justice Dipak Misra will on Monday hear the case about Judge BH Loya's death, one of the main triggers for last week's unprecedented crisis in India's judiciary.

జస్టిస్ లోయ కేసు విచారణ అంశం మలుపు తిరిగింది. ఈ కేసు విచారణ చేపట్టే బెంచీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా కూడా ఉంటారు. ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనానికి ఆయన నేతృత్వం వహిస్తారు. అంతకు ముందు ఈ బెంచీలో ఉన్న అరుణ్ మిశ్రాను పక్కకు తప్పించారు. సోమవారం నుంచి లోయ కేసును విచారించే బెంచ్‌లో దీపక్ మిశ్రా ఉంటారు. లోయ కేసు విచారణను ప్రస్తావిస్తూ ఇటీవల నలుగురు సీనియర్ న్యాయమూర్తులు మీడియా ముందుకు వచ్చి విమర్శలు చేసిన విషయం తెలిసిందే.
ఇప్పటి వరకు లోయా కేసును జస్టిస్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ విచారిస్తూ వచ్చింది. సోమవారం నుంచి ఈ కేసు విచారణను దీపక్ మిశ్రా ఆధ్వర్యంలోని 10వ నెంబర్ కోర్టు విచారిస్తుంది. దీపక్ మిశ్రా నేతృత్వం వహించే ఈ బెంచ్‌ల జస్టిస్ ఎం ఖాన్విల్కర్, జస్టిస్ చంద్రచూడ్ ఉంటారు. జస్టిస్ లోయ నాగపూర్‌లో 2014 డిసెంబర్‌లో మరణించార. అమిత్ షా నిందితుడిగా ఉ్న ఓ ఎన్‌కౌంటర్ కేసును విచారిస్తున్న లోయ మరణించడం వివాదంగా మారింది.

Category

🗞
News

Recommended