దానం వలస పై హైకమాండ్ భేటి

  • 6 years ago
Congress high command on Saturday calls Telangana PCC chief Uttam Kumar Reddy to come to delhi.
#UttamKumarReddy

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత, మాజీ మంత్రి దానం నాగేందర్ బాటలోనే మరో సీనియర్ నేత ముఖేష్ గౌడ్ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. శనివారం ముఖేష్ గౌడ్.. టీఆర్ఎస్ పార్టీ నేతలను కలవడం ఇందుకు నిదర్శనంగా తెలుస్తోంది.
అయితే, ముఖేష్ గౌడ్ తనతోపాటు తన కుమారుడు విక్రమ్ గౌడ్‌కు కూడా టికెట్ ఆశిస్తున్నట్లు సమాచారం. అంతా అనుకున్నట్లు జరిగితే తన కుమారుడు, ఇతర కార్యకర్తలతోపాటు ముఖేష్ గౌడ్ కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దానం నాగేందర్ టీఆర్ఎస్ పార్టీలో చేరిక ఖరారైపోయింది. ఆయన ఆదివారం సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు.

Category

🗞
News

Recommended