Kishore Kumar Reddy, the younger brother of former Congress Chief Minister of undivided AP Nallari Kiran Kumar Reddy, announced that he was joining the ruling Telugu Desam in AP.
ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి సోదరుడు నల్లారి కిషోర్‌కుమార్ రెడ్డి టిడిపిలో చేరేందుకు రంగం సిద్దమైంది. గురువారం రాత్రి కిషోర్ కుమార్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబునాయుడును అమరావతిలో కలుసుకొన్నారు. త్వరలోనే కిషోర్‌కుమార్ రెడ్డి టిడిపిలో చేరనున్నారు. చిత్తూరు జిల్లాలో టిడిపిని బలోపేతం చేసేందుకు ఆ పార్టీ నాయకత్వం చర్యలు తీసుకొంటుంది. ఇందులో భాగంగానే వలసలను టిడిపి ప్రోత్సహిస్తోంది. చాలా కాలంగా నల్లారి కిషోర్‌కుమార్ రెడ్డితో టిడిపి నేతలు సంప్రదింపులు జరుపుతున్నారు.
కిరణ్‌కుమార్ రెడ్డి గత ఎన్నికల్లో పోటీ చేయలేదు. జై సమైక్యాంద్ర పార్టీని ఏర్పాటు చేశారు కిరణ్‌కుమార్ రెడ్డి. ఆ పార్టీ తరపున కిషోర్‌కుమార్ రెడ్డి పోటీ చేశారు. కానీ, ఆయన ఓటమి పాలయ్యారు. ఏపీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతానికి ఆశాజనకంగా పరిస్థితులు లేవు. కిరణ్‌కుమార్ రెడ్డి బిజెపిలో చేరుతారనే ప్రచారం కూడ సాగింది. కానీ, ఆయన ఇంతవరకు ఏ పార్టీలో చేరలేదు. ఐతే కిషోర్‌కుమార్ రెడ్డి టిడిపిలో చేరాలని నిర్ణయం తీసుకొన్నారు. వచ్చే ఎన్నికల్లో పీలేరు అసెంబ్లీ స్థానం నుండి కిషోర్‌కుమార్ రెడ్డి పోటీ చేసే అవకాశం ఉంది.ఈ నెల 23 లేదా 25వ, తేదిన కిషోర్‌కుమార్ రెడ్డి టిడిపిలో చేరే అవకాశం ఉంది. సుమారు 40 మంది సర్పంచ్‌లతో కలిసి కిషోర్‌కుమార్ రెడ్డి టిడిపిలో చేరనున్నారు.

Category
🗞
News