• 7 years ago
Taking exception to Assembly Speaker Kodela Siva Prasad Rao announcing that only 2 per cent of works of Polavaram project were taken up between 1941 and 2014 and the works have gained pace and 56 per cent of works have been completed in the past four years, Congress Rajya Sabha member KVP Ramachandra Rao said the TDP government seems to have misled the Speaker too by giving him false information.
#kvpramachandrarao
#kodelasivaprasad
#kirankumarreddy
#andhrapradesh
#specialstatus


కాంగ్రెస్ పార్టీ హయాంలో పోలవరం ప్రాజెక్టు పనులు రెండు శాతమే జరిగాయని వ్యాఖ్యానించడంపై కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్ర రావు ఏపీ సభాపతి కోడెల శివప్రసాద్‌కు లేఖ రాశారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. దాదాపు మూడువేల మంది రైతులను తీసుకొని అట్టహాసంగా పోలవరం సందర్శన యాత్ర చేసి పోలవరం ప్రాముఖ్యాన్ని తెలిసేలా చేసినందుకు అభినందనలు అన్నారు. కానీ పోలవరం సందర్శన తర్వాత చేసిన వ్యాఖ్యలు సరికాదని కోడెలకు చెప్పారు. 1941 నుంచి 2014 వరకు కేవలం రెండు శాతమే జరిగిందని, అప్పటి నుంచి ప్రస్తుత సీఎం చంద్రబాబు కార్యదక్షత, చొరవ వల్ల ప్రాజెక్టును ప్రస్తుత జలవనరుల శాఖ మంత్రిగారికి అప్పగించగానే ప్రాజెక్టు 56 శాతం పూర్తయిందని మీరు చెప్పారని, స్పీకర్‌గా ఉన్న మీరు ఇలా జాతిని తప్పుదోవ పట్టించవచ్చునా అని కోడెలను ప్రశ్నించారు. ఇలా చేస్తారని కలలో కూడా అనుకోలేదన్నారు.

Category

🗞
News

Recommended