వైసీపీ ద్వంద్వ నీతా? విజయసాయి మోడీ కాళ్లకు మొక్కలేదా ?

  • 6 years ago
In today's Rajyasabha, the YSRCP leader Vijayasai Reddy respectfully touched the feet of Prime Minister Narendra Modi

ఏపీ రాజకీయాల్లో టీడీపీ వైసీపీల మధ్య ఇప్పుడు తీవ్రమైన ఫైట్ నడుస్తోంది. రాష్ట్ర ప్రయోజనాలపై పోరు విషయంలో తమదంటే తమదే చిత్తశుద్ది అని నిరూపించుకోవడానికి ఇరు పార్టీలు పాకులాడుతున్నాయి. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు కూడా. ఏ చిన్న అవకాశం దొరికినా ప్రత్యర్థిని ఇరుకునపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ చేతికి ఇప్పుడు మరో అవకాశం చిక్కినట్టే కనిపిస్తోంది.
మోడీకి ఆర్థిక నేరస్తులతో ఏం పని?.. అంటూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై టీడీపీ తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఒకవిధంగా.. బీజేపీ, వైసీపీ కుమ్మక్కై టీడీపీని టార్గెట్ చేశాయనేది ఆ పార్టీ ఆరోపణ. ఇలాంటి తరుణంలో రాజ్యసభలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. మంగళవారం రాజ్యసభకు వచ్చిన మోడీ వద్దకు వెళ్లి.. విజయసాయిరెడ్డి ఆయనకు నమస్కారం చేశారు. ఆపై ఆయన పాదాలను తాకి ఆశ్వీరాదం తీసుకున్నారని అంటున్నారు. వైపు కేంద్ర ప్రభుత్వంపై విశ్వాసం లేదని అవిశ్వాసానికి నోటీసులు ఇస్తూనే.. మరో పక్క మోడీని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తుండటం వైసీపీ ద్వంద్వ నీతికి నిదర్శనమని టీడీపీ ఎంపీలు ఆరోపిస్తున్నారు.
ప్రధాని మోడీ కాళ్లకు వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి మొక్కారా, లేదా అనేది వివాదంగానే మారుతోంది. వైసిపి ఎంపీ విజయసాయి రెడ్డిపై తెలుగుదేశం పార్టీ ఎంపీ సిఎం రమేష్ తీవ్రంగా మండిపడ్డారు. పార్లమెంటులో మోడీ కాళ్లపై పడుతారని, బయట చంద్రబాబును విమర్శిస్తారని ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.
ప్రధాని మడీ కాళ్లపై పడలేదని విజయసాయి రెడ్డి గుండె మీద చేయి వేసుకుని చెప్పాలని ఆయన సవాల్ చేశారు. విజయసాయి రెడ్డి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెడుతున్నారని విరుచుకుపడ్డారు. అవిశ్వాసం అంట వైసిపి నాటకాలు ఆడుతోందన, వైసిపి బండారం బయటపడిందని అన్నారు.

Category

🗞
News

Recommended