ఓ విధంగా 2009 నాటి సీన్ రిపీట్ అవుతుందా?

  • 6 years ago
Political analysts saying that Praja Rajyam and Lok Satta had impacted and even changed the fate of many candidates during 2009 general polls. Similar scenes can be expected in the next polls.

వచ్చే ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లెఫ్ట్ పార్టీలతో కలిసి ముందుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లుగా కనిపిస్తోంది. ప్రత్యేక హోదా ఉద్యమంలోనే కాకుండా 2019 ఎన్నికల్లోను పవన్‌తో కలిసి పోటీ చేసేందుకు సీపీఐ ఆసక్తితో ఉంది. తాము వచ్చే ఎన్నికల్లో జనసేనతో కలిసి ముందుకు సాగుతామని, ప్రజల సంక్షేమమే తమ అజెండా అని లెఫ్ట్ పార్టీలు చెబుతున్నాయి.
పవన్ కళ్యాణ్ లెఫ్ట్ పార్టీలతో కలిస్తే ఇతర పార్టీలపై ప్రభావం బాగా చూపే అవకాశాలున్నాయని అంటున్నారు. లెఫ్ట్ పార్టీలకు గ్రామీణ, నగర ప్రాంతాల్లో ఓటు బ్యాంకు ఉంది. ఇది జనసేనకు ఉపయోగపడుతుంది. అలాగే పవన్ కళ్యాణ్‌కు వ్యక్తిగతంగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇది అంతకంటే ఎక్కువగా లెఫ్ట్ పార్టీలు బలం పుంజుకోవడానికి ఉపయోగపడవచ్చునని భావిస్తున్నారు. ఈ కలయిక టీడీపీ, వైసీపీ, బీజేపీని దెబ్బతీస్తుందని భావిస్తున్నారు. ఈ విషయంలో ఇప్పటికే ఆ పార్టీలు ఆందోళనగా ఉన్నాయని అంటున్నారు.
వచ్చే ఎన్నికల్లో తాను అనంతపురం జిల్లా నుంచి పోటీ చేస్తానని పవన్ కళ్యాణ్ గతంలో ప్రకటించారు. ఆయన క్రేజ్‌కు లెఫ్ట్ జత కలుస్తుంది. రెండు దశాబ్దాల క్రితం అనంతపురంలో సీపీఐ గెలిచింది. ఇప్పుడు పవన్ ద్వారా పుంజుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇతర గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఓటు బ్యాంకు ఉంది. కానీ ఇన్నాళ్లు పోటీ చేయకపోవడమో లేక గెలుస్తారనే నమ్మకం లేక ఓటు ఇతర పార్టీలకు పడ్డ సందర్భాలు కొట్టి పారేయలేం.
పవన్ కళ్యాణ్‌కు లెఫ్ట్ పార్టీలు జత కలిస్తే అది ఇతర పార్టీలపై తీవ్ర ప్రభావం పడుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 2009 సాధారణ ఎన్నికల సమయంలో పవన్ అన్నయ్య చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి కాంగ్రెస్, టీడీపీ ఓట్లను భారీగా చీల్చారు. చిరంజీవి పీఆర్పీతో పాటు లోక్‌సత్తా కారణంగా నాడు టీడీపీ దెబ్బతిన్నదనే అభిప్రాయాలు ఉన్నాయి.

Recommended