Vijay Devarakonda Sharing Screen With Venkatesh In Next Movie

  • 7 years ago
Film Nagar source said that, Vijay Devarakonda to share screen space with Venkatesh in next. Popular Kannada producer Rockline Venkatesh is said to be helming the ambitious project, though there are no statements from the makers so far.
'అర్జున్ రెడ్డి' సినిమాతో సంచలన స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండకు వరుస అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. అతడు నటించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. యూఎస్ఏలో తొలి 4 రోజుల్లోనే 1 మిలియన్ మార్క్ అందుకుంది. వరల్డ్ వైడ్ రూ. 21 కోట్ల గ్రాస్ సాధించినట్లు సమాచారం. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం విజయ్ దేవరకొండ త్వరలో ఓ మల్టీ స్టారర్ మూవీలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. విక్టరీ వెంకటేష్‌తో కలిసి ఈ సినిమా చేయబోతున్నట్లు సమాచారం. 'అర్జున్ రెడ్డి' షూటింగ్ సమయంలోనే విజయ్ ఈ ఆఫర్ ఓకే చేసినట్లు టాక్.
ప్రముఖ కన్నడ నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కించబోతున్నట్లు సమాచారం.

Recommended