• 2 days ago
 ఏ ముహూర్తాన బీసీసీఐ శ్రేయస్ అయ్యర్ సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించిందో తెలియదు కానీ అప్పుడు కొన్నాళ్లు అయ్యర్ బాధపడినా చేసినా తన ఫేట్ మాత్రం పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు అయ్యర్ ఏం పట్టినా బంగారమే. అఫ్ కోర్స్ అందులో అతని కష్టమే చాలా ఉంది. నిరుడు కోల్ కతా నైట్ రైడర్స్ ను ఛాంపియన్ గా నిలిపిన శ్రేయస్ అయ్యర్...కోల్ కతాను వదిలేయాలని నిర్ణయం తీసుకున్నప్పుడు చాలా మంది ప్రశ్నించారు. కప్పు గెలిపించిన వాడివి టీమ్ ను వదిలేయటం ఏంటీ అని. కానీ అయ్యర్ అలా వదిలేయటం వల్ల చాలా లాభాలే పొందాడు. మొదటిది అతని ఆక్షన్ ప్రైస్. వేలం పాటలో 10 కోట్లు పలికితే ఎక్కువ అని ఫీలైన అయ్యర్ ను ఏకంగా 25కోట్లకు కొనుక్కుంది పంజాబ్ కింగ్స్. రెండోది పంజాబ్ కింగ్స్ అనుభవుజ్ఞుడైన అయ్యర్ ను కెప్టెన్ గా ఎంపిక చేసి మరో మేలు చేసింది. మూడోది ఛాంపియన్స్ ట్రోఫీ కోసం తప్పని సరి పరిస్థితుల్లో అయ్యర్ ను మళ్లీ టీమిండియాకు ఆడించేలా కూడా ప్లాన్ చేశారు. అది జరిగింది. ఇప్పుడు నాలుగోది రేపో ఎల్లుండో బీసీసీఐ ప్రకటించనున్న సెంట్రల్ కాంట్రాకుల్లో A గ్రేడ్ ను అయ్యర్ దక్కించుకుంటాడని అంతా భావిస్తున్నారు. ఈ జోష్ ను ఐపీఎల్లోనూ చూపిస్తున్న శ్రేయస్ అయ్యర్ ఆడిన రెండు మ్యాచుల్లోనూ పంజాబ్ ను విజయతీరాలకు చేర్చాడు. మొదటి మ్యాచ్ ను గుజరాత్ పై రెండో మ్యాచ్ ను నిన్న రాత్రి లక్నో్పై  గెలిచి నిలిచింది పంజాబ్ కింగ్స్. ఇది కెప్టెన్ గా అయ్యర్ సక్సెస్. కానీ ఆటగాడిగానూ బీభత్సమైన ఫామ్ లో ఉన్నాడు శ్రేయస్ అయ్యర్. మొదటి మ్యాచ్ లో గుజరాత్ పై 97 పరుగులు చేసిన నాటౌట్ గా నిలిచిన శ్రేయస్ అయ్యర్ రెండో మ్యాచ్ లో లక్నోపై 30 బాల్స్ లోనే 52పరుగులు చేసి ఈ మ్యాచ్ లో నాటౌట్ గా నిలిచాడు. రెండు మ్యాచుల్లోనూ పంజాబ్ విజయాల్లో శ్రేయస్ అయ్యర్ దే కీలకపాత్ర. అలా కోల్ కతా నుంచి బయటకు రావటం అయ్యర్ కు ఇన్ని రకాలుగా కలిసి వచ్చిందన్నమాట.

Category

🗞
News
Transcript
00:00एमुहूर्तन BCCI स्रेय सययरनू सेंट्रल काउनरक्ट निंच तपिञ्चन तलीद गानी अप्पडु कन नाल्ल आयर बादपडना चेसना तन �
00:30वयलम पाटल पधि कोट्ल पलिगते एक्क्वा नि फीलयन आयरनू एकंगा 25 कोटल रपायल कोनकुन्दे पंजाब क
01:00इसना पललगा इपिललगोडा चुबसतन स्रेयेस्ययर् अडिन रन्डु मचललललललनो पंजाबनु वजे तेराललगो च�
01:30कूल्कता नुझि बईटक Roberts आयर को अन्नी रकाललगा कोडर कळसा उचन्द अनो मात.

Recommended