Chandrababu Meeting with TDP leaders: పార్టీ కోసం రక్తం చిందించిన కార్యకర్తలకు అండగా నిలిచే బాధ్యత తనదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. జీడి నెల్లూరు పర్యటనలో భాగంగా రామానాయుడు పల్లె సమీపంలో పార్టీ శ్రేణులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ట్రూ స్పిరిట్‌తో పొలిటికల్ గవర్నెన్స్ చేస్తానన్నారు. సాంకేతికత వినియోగించడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయన్నారు. పదవుల కోసం తన చుట్టు తిరగవద్దని, ప్రజలతో తిరగాలని ఆయన తెలిపారు. పదవులు మిమ్మల్ని వెతుక్కుంటూ రావాలి అంటే ప్రజలతో ఉండాలన్నారు.
Category
🗞
News