• yesterday
Minister Payyavula Keshav oN Rural Development : ఏపీ శాసనసభలో 2025-26 వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ ప్రవేశపెట్టారు. రూ.3.22 లక్షల కోట్లతో బడ్జెట్‌ను సభ ముందుకు తీసుకొచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తోందని మంత్రి పయ్యావుల కేశవ్‌ తెలిపారు. జల్‌జీవన్‌ మిషన్‌ ద్వారా 95.44 లక్షల గ్రామీణ గృహాలకు తాగునీరు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖకు 18,847 కోట్ల రూపాయల కేటాయింపును మంత్రి ప్రతిపాదించారు.

Category

🗞
News

Recommended