• 2 years ago
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో పోస్టల్ సిబ్బంది నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. పట్టణ ప్రజలకు చేరవేయాల్సిన బ్యాంక్ లెటర్స్, వివిధ ప్రభుత్వ శాఖలకు చేరాల్సిన లేఖలు, ఇతర వస్తువులను బట్వాడా చేయకుండా తొర్రగుంటపాలెం ఆర్డీవో ఆఫీస్ వెనుక ముళ్లకంపలో పడేశారు. వీటిలో వీటిలో లాయర్ నోటీసులు, వివిధ దేవాలయాల నుంచి వచ్చిన ప్రసాదాలు, నిరుద్యోగులకు ఆర్డర్ పెట్టుకున్న స్టడీ మెటీరియల్, సుమారు 200 ఒరిజినల్ ఆధార్ కార్డులు, ఇంకా ఎన్నో రకాల రిజిస్టర్ పోస్టులు ఉన్నాయి. రిజిస్టర్ పోస్టులకు ప్రత్యేకంగా డబ్బులు వసూలు చేసే పోస్టల్ శాఖ ప్రజలకు అందాల్సిన వస్తువులను ముళ్లకంపలో పడేయడం ఏంటని ప్రజలు నిలదీస్తున్నారు. దీనిపై అధికారులు స్పందించిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Category

🗞
News

Recommended