రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు వైభవం తెచ్చేందుకు, ప్రభుత్వ విద్యను పటిష్టం చేయడానికి విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారి అధ్యక్షతన వేసిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో నిర్వహించారు. మన ఊరు-మన బస్తీ-మన బడిపై సమీక్ష జరిపారు. దీనికి మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, సత్యవతి రాథోడ్, నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పాఠశాలల్లో మౌలిక వసతుల మెరుగుదల, డిజిటల్ విద్య, ఇంగ్లిష్ మీడియంలో బోధన, సంబంధిత అంశాలపై చర్చించారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం మన ఊరు-మన బడి పథకాన్ని (పట్టణాల్లో మన బస్తీ-మన బడి) అమలు చేస్తోంది.
Category
🗞
News