వామ్మో.. Pujara నా మీద పడ్డాడేంటీ..! || Oneindia Telugu

  • 3 years ago
Ind vs Eng 2021 : Cheteshwar Pujara’s shot put the umpire in trouble during 3rd test 3rd day against england, see how the umpire saved himself in video.
#IndvsEng2021
#CheteshwarPujara
#Cricket
#TeamIndia
#RohitSharma
#ViratKohli
#JamesAnderson
#RishabhPant
#olirobinson
#JaspritBumrah
#MohammedSiraj
#KLRahul
#JoeRoot

ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో టీమిండియా నయావాల్ చతేశ్వర్ పుజారా దుమ్మురేపుతున్నాడు. తనపై వచ్చిన విమర్శలకు బ్యాట్‌తో సమాధానమిస్తున్నాడు. కీలక సమయంలో చతేశ్వర్ పుజారా (180 బంతుల్లో 15 ఫోర్లతో 91 బ్యాటింగ్‌) దూకుడుగా ఆడుతూ భారత్ ఇన్నింగ్స్‌కు వెన్నెముకలా నిలుస్తూ సెంచరీకి చేరువయ్యాడు. వరుస వైఫల్యాలకు చెక్ పెడుతూ అసలు సిసలు టెస్ట్ బ్యాట్స్‌మెన్‌ను తలపిస్తూ చెలరేగాడు. అయితే మూడో రోజు ఆటలో పుజారా తన దూకుడు బ్యాటింగ్‌తో ఫీల్డ్ అంపైర్ రిచర్డ్ కెటిల్‌బరోను వణికించాడు. అతని ఆడిన పుల్ షాట్.. లెగ్ అంపైరింగ్ చేస్తున్న రిచర్డ్ కెటిల్‌బరో వైపు దూసుకెళ్లింది. వెంటనే అప్రమత్తమైన అంపైర్.. చచ్చాన్రా దేవుడా అంటూ పక్కకు జరిగాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.