• 4 years ago
Top News Of The Day: 2021 IPL Auction live updates. CM Jagan thinks that if the govt approves 7,000 acres of unused land in the Visakhapatnam steel plant and sells with layouts and plots, then the cash reserves will increase and there is no need to privatize it.

#IPL2021AuctionLiveUpdates
#VizagSteelPlantprivatisation
#GlennMaxwell
#DawidMalan
#APmunicipalelections
#FarmersDharna
#GovernmentofIndia
#LadakhStandoff
#APLocalBodyElections
#SECNimmagaddaRameshKumar
#apcmjagan
#CoronaVaccination
#PMModi
#Farmers
#indiachinabordertensions
#FarmLaws
#NewDelhi

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించడాన్ని అడ్డుకోవడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నానని ప్రకటించారు. పోస్కో సంస్థను విశాఖలో అడుగుపెట్టనివ్వనని ప్రకటించారు. అంతేకాదు లక్షలాది మంది కార్మికులకు జీవనోపాధి కల్పిస్తున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయకుండా కర్మాగారంలో నిరుపయోగంగా ఉన్న 7 వేల ఎకరాల భూమిని విక్రయించడానికి ప్రభుత్వానికి అనుమతిస్తే విశాఖ ఉక్కు సంపన్నమవుతుందని, అప్పుడు దానిని ప్రైవేటీకరించవలసిన అవసరం లేదని సీఎం జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. ఆటగాళ్లపై కోట్లు కుమ్మరించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)‌ వేలానికి వేళయింది. ఈ ఏడాది 14వ సీజన్‌ కోసం ఆటగాళ్ల మినీ వేలం గురువారం మధ్యాహ్నం 3 గంటల నుంచి చెన్నైలో జరుగనుంది. మొత్తం 292 మంది ఆటగాళ్లు అదృష్టం పరీక్షించుకోనున్నారు. 8 ఫ్రాంచైజీలు మొత్తం కలిపి 61 మంది ప్లేయర్లను తీసుకునే అవకాశం ఉంది. భారత ఆటగాళ్లతో పాటు విదేశీ స్టార్ క్రికెటర్లూ బరిలో నిలవడం ఆసక్తి రేపుతోంది. మరోవైపు అవకాశం కోసం ఎదురుచూస్తున్న దేశవాళీ కుర్రాళ్లకూ మంచి ధర పలికే సూచనలు కనిపిస్తున్నాయి. వీరిలో అదృష్టం ఎవరిని వరించనుందో చూడాలి.

Category

🗞
News

Recommended