NBK 105 Launched,Regular Shooting From July || Filmibeat Telugu

  • 5 years ago
NBK 105 Launched, Regular shooting from July. The successful combination of hero Nandamuri Balakrishna and director KS Ravi Kumar are coming together for the second time for this movie.
#balakrishna
#nbk105
#ksravikumar
#ckalyan
#tollywood
#ntrbiopic

'ఎన్టీఆర్ బయోపిక్' తర్వాత బాలయ్య చేయబోయే చిత్రం ఏది? అనే విషయంలో కొన్ని రోజులుగా అయోమయ పరిస్థితి నెలకొన్ని సంగతి తెలిసిందే. కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలయ్య మూవీ ప్రారంభం కావాల్సి ఉండగా ఆగిపోయినట్లు రూమర్స్ హల్ చల్ చేశాయి. ఆ పుకార్లకు తెర దించుతూ ఆయన 105వ చిత్రం గురువారం ప్రారంభం అయింది. సి కళ్యాణ్ నిర్మాతగా హ్యాపీ మూవీస్ పతాకంపై ప్రొడక్షన్ నెం.5గా రూపొందుతున్న ఈ చిత్రానికి కెఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముహూర్త సన్నివేశానికి వి.వి.వినాయక్‌ క్లాప్‌ కొట్టగా, బోయపాటి శ్రీను కెమెరా స్విచ్‌ ఆన్‌ చేశారు. కోదండరామిరెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు.

Recommended