• 5 years ago
Adavi Sheshu, Supriya affair news goes viral in Telugu media. This happend befor YS Jagan and Nagarjuna meeting on Monday. Report suggest that One of AP Governemnts, favoured media attempted this in politcal angle.
#AdaviSheshu
#Supriya
#ysjagan
#nagrjunametysjagan
#ysrcp
#nagarjuna
#PoliticalAngle
#APGovernment
#tollywood

రాజకీయాలు, పాలిటిక్స్‌లో ఎవరిపైనైనా బద్‌నాం చేయాలంటే ఏ చిన్న విషయం దొరికినా దానిని మీడియాలో గోరంతలు కొండంతలు చేయడం చాలా సార్లు కనిపించింది. అలాంటి కోవలోనే హీరో అడివి శేష్, నిర్మాత సుప్రియ వ్యవహారం వెలుగుచూసింది. వీరిద్దరి మధ్య అఫైర్ ఉందా, కొనసాగుతుందా అనే విషయాన్ని పక్కన పెడితే వీరి బంధానికి రాజకీయ రంగు పులిమారానే వాదన సినీ, రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తుంది. ఏపీ రాజకీయాలకు అడివి శేషు, సుప్రియ బలయ్యారా అనే సందేహాలను వెల్లువెత్తుతున్నాయి. ఏపీ రాజకీయాలకు, వీరిద్దరి ప్రేమ వ్యవహారానికి లింకేమిటని ఆలోచిస్తున్నారా? అయితే వివరాల్లోకి వెళ్లిపోదాం..
అక్కినేని నాగార్జున మేనకోడలు సుప్రియ, అడివి శేషు మధ్య అఫైర్ నడుస్తున్నదనేది సినీ వర్గాల్లో తరుచుగా చర్చ జరుగుతున్నది. కానీ వాటికి పెద్దగా ప్రాధాన్యం దక్కకపోవడంతో ఆ వార్త మరుగున పడింది. కానీ ఏపీ ఎన్నికల వేడి రగులుకొంటున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అధికార వర్గానికి అనుకూలమైన మీడియాలో అడివి శేషు, సుప్రియ గురించి వార్త పతాక శీర్షికల్లో ప్రచురించింది. కానీ ఈ వార్త వెనుక రాజకీయ కోణం ఉందా అనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
ఫిబ్రవరి 19 సోమవారం రోజును ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకొన్నది. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, సినీ నటుడు అక్కినేని నాగార్జున భేటీ అయ్యారు. వీరి కలయిక ఏపీ రాజకీయాలను ఓ కుదుపు కుదిపేసింది. రకరకాల ఆరోపణలు ప్రత్యారోపణలు రాజకీయాల్లో చోటు చేసుకొన్నాయి.

Category

🗞
News

Recommended