• 6 years ago
Time is coming to 10th grade exams. The exams to be started from March 16 are only two months away. However, students of government schools are confused by the syllabus.
#TelanganaElections
#SSC
#10thexams
#syllabus
#governmentschools


ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థులకు పరీక్షల భయం పట్టుకుంది. ఎగ్జామ్స్ దగ్గరపడుతున్నా.. సిలబస్ పూర్తికాకపోవడం వారిని ఆందోళనకు గురిచేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అకాడమిక్ ఇయర్ మొదలు ఇప్పటిదాకా అడుగడుగునా సమస్యలే దర్శనమిస్తున్నాయి. పరీక్షలకు ఇంకా రెండు నెలల సమయం మాత్రమే మిగిలిఉండటంతో పదో తరగతి విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వాస్తవానికి డిసెంబర్ నాటికే సిలబస్ పూర్తికావాల్సి ఉంది. అంతేకాదు ఈపాటికి రివిజన్ తరగతులు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ చాలా చోట్ల బోధన కూడా పూర్తి కాలేదు. దీంతో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి.

Category

🗞
News

Recommended