• 7 years ago
YCP getting more cine glamour in party. Mohan Babu and nagarjuna Families interesting in join in YCP. Akkineni Amala may contest from YCp as MP candidate from Guntur or vijayawada.

వైసిపి కి మరింత సినీ గ్లామ‌ర్ తోడు కానుంది. ఎన్నిక‌ల్లో వైసిపి నుండి పోటీ చేయ‌టానికి సినీ ప్ర‌ముఖులు ఆస‌క్తి చూపిస్తు న్న‌ట్లు తెలుస్తోంది. వీరికి సీట్లు కేటాయింపు పైనా ఒక స్ప‌ష్ట‌త వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. జ‌గ‌న్ పాద‌యాత్ర ముగిసిన త‌రు వాత వీరు అధికారికంగా పార్టీ ఎంట్రీ..సీట్ల ఖ‌రారు పూర్త‌వుతుంద‌ని విశ్వ‌స‌నీయ స‌మాచారం.

వైసిపి లో ఇప్ప‌టికే సినీ న‌టి రోజా ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక‌, సినీ న‌టులు విజ‌య్ చంద‌ర్‌, తాజాగా పృధ్వీ, భాను చంద‌ర్ లు వైసిపి అధినేత‌కు మ‌ద్ద‌తుగా ఉంటున్నారు. ఇక, సినీ హీరో కృష్ణ వైయ‌స్ పై అభిమానంతో ఉండే వారు. ఇక‌, మోహ‌న్ బాబు వైసిపి అంటే ఆస‌క్తి చూపిస్తున్నారు. ఆయ‌న ప‌లు మార్లు జ‌గ‌న్ ను క‌లిసారు. మోహ‌న్‌బాబు ఈ సారి వైసిపి నుండి ఎన్నిక‌ల బ‌రిలో ఉంటార‌నే ప్ర‌చార‌మూ జ‌రుగుతోంది. ఆయ‌న గ‌తంలో టిడిపి నుండి రాజ్య‌స‌భ స‌భ్యుడిగా వ్య‌వ‌హరించారు.

#ysrcp
#2019elections
#ysjagan
#MohanBabu
#nagarjuna
#AkkineniAmala

Category

🗞
News

Recommended