Telangana Elections 2018 : కమ్మ, రెడ్ల పొత్తేంటో : కేసీఆర్ వ్యాఖ్యల మర్మమేంటి? | Oneindia Telugu

  • 6 years ago
Telangana Elections 2018: kcr latest speech to in khammam that caste and religion may not be given food. kcr targets on mahakutami indirectly on khamma, reddys influence.
#TelanganaElections2018
#kcr
#mahakutami
#khamma


కులమతాల ఉచ్చులో చిక్కుకోవద్దని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యానించడం హాట్ టాపికయ్యింది. ఓట్ల కోసం ఆ రెండు కులాల నాటకంలో సమిధలు కావొద్దని ఓటర్లకు పిలుపునివ్వడం చర్చానీయాంశంగా మారింది. ఖమ్మం జిల్లా ప్రచార సభల్లో పాల్గొన్న కేసీఆర్.. ఆ రెండు కులాలంటూ పరోక్షంగా టార్గెట్ చేశారు. ముసుగులతో వచ్చి ఓట్లడిగేవారికి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ ను ఓడించాలనే లక్ష్యంతో దుష్టశక్తులు ఏకమయ్యాయని ఆరోపించిన కేసీఆర్.. కమ్మ, రెడ్ల పొత్తేంటో అన్నట్లు ఫైరయ్యారు. అయితే కులాల పేర్ల ప్రస్తావన తీసుకురాకుండా పరోక్షంగా మహాకూటమి పొత్తులపై విరుచుకుపడ్డారు.