Kaala Movie Tickets Gets Discount In America

  • 6 years ago
Rajinikanth's Kaala movie getting ready to release on June 7th. In this occassion, Kaala Audio function organised in Hyderabad on June 4th.

పా రంజిత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్ 7వ తేదీన రిలీజ్‌కు సిద్ధమవుతున్నది. కబాలి తర్వాత రజనీకాంత్‌తో పా రంజిత్ వరుసగా మరో సినిమాను రూపొందించడం గమనార్హం. ముంబైలోని మురికివాడ ధారవిలో నివసించే తమిళ వలస జీవుల హక్కుల కోసం పోరాడే పాత్రలో రజనీకాంత్ కనిపించనున్నారు.
కాలా మూవీ రిలీజ్‌ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా అభిమానుల సందడి పెరిగిపోతున్నది. ఫ్యాన్స్ జోష్ చూసిన పలు కంపెనీలు అనేక డిస్కౌంట్లు, ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. అమెరికాలో ఈ డిస్కౌంట్లు, ఆఫర్ల వ్యవహారం ఎక్కువగా కనిపిస్తున్నది. రెండు టికెట్లు కొంటే 10 డాలర్లు తగ్గింపు అని ఆఫర్‌ను కంపెనీలు ప్రకటిస్తున్నాయి. అలాగే సినీ మార్క్ మూవీ క్లబ్‌ అనే కంపెనీ కూడా తొలిసారి తమ క్లబ్ చేరితే 5 డాలర్లు డిస్కౌంట్ అని పేర్కొన్నది.

Recommended