Actor Rajinikanth Press Meet On Kaala Release

  • 6 years ago
Actor Rajinikanth has met the press for Kaala movie in Karnataka. Rajinikanth Speaking in Kannada in press conference. Kala Cinema is releasing on June 7th
#ActorRajinikanth

సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కాలా సినిమా గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతోంది. అయితే కర్ణాటకలో కాలా సినిమా విడుదల అడ్డంకులకు ఇంకా బ్రేక్ పడలేదు. కర్ణాటకలో గురువారం కాలా సినిమా విడుదల అవుతుందా, లేదా అనే ప్రశ్నకు ఇంకా సమాధానం చిక్కడం లేదు.
కర్ణాటకలో కాలా సినిమా విడుదల అవుతున్న థియేటర్ల దగ్గర భద్రత కల్పించాలని కర్ణాటక హైకోర్టు ఆ రాష్ట్ర డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది. కాలా సినిమా పంపిణిదారులు, సినిమా విడుదల అవుతున్న థియేటర్ల యాజమాన్యం పోలీసులతో సంప్రధించాలని కర్ణాటక హైకోర్టు సూచించింది.
ఈ సందర్బంలో కాలా సినిమాను విడుదల చెయ్యడానికి కర్ణాటక చలనచిత్ర వాణిజ్య మండలి వ్యతిరేకిస్తోంది. ఈ సమయంలో సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ కన్నడిగులకు మనవి చేశారు. బుధవారం మీడియాతో కన్నడలో మాట్లాడిన రజనీకాంత్ కాలా సినిమా విడుదలకు అవకాశం ఇవ్వాలని కన్నడిగులకు మనవి చేశారు. కావేరీ నీటి పంపిణి విషయంలో సుప్రీం కోర్టు ఏమి చెప్పిందో తాను అదే చెప్పానని, అందులో తప్పేమిలేదని రజనీకాంత్ అంటున్నారు. కావేరీ నీటి పంపిణికి, కాలా సినిమాకు ముడిపెట్టడం ఎంత వరకు న్యాయం అని రజనీకాంత్ అంటున్నారు. కాలా సినిమా విడుదలకు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, కన్నడిగులు సహకరించాలని రజనీకాంత్ కన్నడలోనే మనవి చేశారు.

Recommended