Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu laugh for Telangana TDP leader Nannuri Narsi reddy comments in Mahanadu.
#chandrababunaidu
#mahanadu
#nannurinarsireddy
#narendramodi
#telugudesam
తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడులో తెలంగాణకు చెందిన పార్టీ నాయకుడు నన్నూరి నర్సిరెడ్డి ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును పడిపడి నవ్వించారు. చంద్రబాబుతో పాటు మహానాడు వేదిక పైన ఉన్న, హాజరైన కార్యకర్తలు పడిపడి నవ్వారు.
నన్నూరి నర్సిరెడ్డి చాలా చలాకీగా మాట్లాడుతారు. మహానాడులోను తన వాక్చాతుర్యం చాటుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి వరకు ఆయన వదిలిపెట్టలేదు. తనదైన శైలిలో వాగ్భాణాలు విసిరారు. దీంతో చంద్రబాబు బాగా నవ్వుకున్నారు.
తాము అచ్చేదిన్ తెస్తామని ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికలకు ముందు చెప్పారని, కానీ ఆయన తెచ్చింది అచ్చేదిన్ కాదని దేశానికి చచ్చేదిన్ తెచ్చారని నన్నూరి అన్నారు. మోడీ బ్యాంకులను ఊడ్చే పనిలో బీజీగా ఉన్నారని విమర్శించారు. పిల్లలకు ఆశ పెట్టి చాక్లెట్ ఇవ్వని తల్లిదండ్రులతో ప్రధాని మోడీని పోలుస్తున్నారని ఎద్దేవా చేశారు.
వైసీపీ అధినేత వైయస్ జగన్ చేస్తోన్న పాదయాత్ర ముద్దుల పోటీనా లేక గుద్దుల పోటీనా అర్థం కావడం లేదని నన్నూరి నర్సిరెడ్డి అన్నారు. జగన్ గుడిని, గుడిలో హుండీని ఎత్తుకు పోయే రకం అన్నారు. చనిపోతూ తన తండ్రి తనకు సీబీఐ కేసులు ఇచ్చి వెళ్లారని జగన్ ఫీలవుతున్నారన్నారు. ఆయనజగన్ కుర్చీ కోసం వేచి చూస్తున్నారని ఓ కథ కూడా చెప్పి ఆకట్టుకున్నారు. ఈ మధ్య తిరుపతిలో వెంకటేశ్వర స్వామి, అలివేలు మంగ కూర్చొని మాట్లాడుకున్నారని, ప్రజల కోసం మనం ఏమైనా చేద్దామని స్వామి వారు అన్నారని, దానికి మంగమ్మ సరేనని చెప్పారని, అప్పటి నుంచి వెంకటేశ్వర స్వామి, మంగమ్మలు భక్తులు వచ్చినప్పుడల్లా గర్భగుడిలోని కుర్చీలో నుంచి లేస్తున్నారని, కానీ జగన్ ఇటీవల వచ్చినప్పుడు మంగమ్మ లేవగా, స్వామివారు లేవలేదని, ఎందుకు అని అడగ్గా.. జగన్ కుర్చీలేకుండా తిరుగుతున్నాడని, మనం లేస్తే ఆయన ఇందులో కూర్చుంటాడని మంగమ్మకు చెప్పారన్నారు.

Category
🗞
News