IPL2018 : Teams Finishing Second League Phase Lifting IPL Title

  • 6 years ago
The prize money for winner and runners-up of IPL 2018 has been ... Indian Premier League (IPL) is a huge achievement for any team. ... of Indian Premier League (IPL) 2018 is set to come to its conclusion.
#ipl2018
#ipl2018final
#chennaisuperkings
#sunrisershyderabad

ఐపీఎల్ 2018 సీజన్ టైటిల్ విజేతగా చెన్నై సూపర్ కింగ్స్ అవతరించిన సంగతి తెలిసిందే. టోర్నీలో భాగంగా ఆదివారం ముంబైలోని వాంఖడె స్టేడియంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించి ట్రోఫీని గెలుచుకుంది.
ఫలితంగా మూడుసార్లు ఐపీఎల్‌ టైటిల్‌ గెలిచిన ముంబై ఇండియన్స్‌ సరసన చెన్నై సూపర్ కింగ్స్ నిలిచింది. కాగా, లీగ్‌ దశలో రెండో స్థానంలో నిలిచి ఐపీఎల్‌ ట్రోఫీని అందుకోవడం చెన్నైకు ఇది రెండోసారి. గతంలో 2011 ఐపీఎల్‌లో లీగ్‌ దశలో రెండో స్థానంలో ఉన్న సీఎస్‌కే టైటిల్‌ను చేజిక్కించుకుంది.
అప్పటి ఫైనల్లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుపై గెలిచి ఐపీఎల్‌ టైటిల్‌ను గెలిచింది. కాగా, లీగ్‌ దశలో రెండో స్థానంలో నిలిచి ఐపీఎల్‌ టైటిల్స్‌ను రెండుసార్లు గెలిచిన జట్ల జాబితాలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌, ముంబై ఇండియన్స్‌ జట్లు మాత్రమే ఉన్నాయి.
2012, 2014లో కోల్‌కతా లీగ్‌ దశలో రెండో స్థానంలో నిలిచి ఐపీఎల్ విజేతగా నిలవగా.... 2013, 2015 సీజన్లలో ముంబై ఇండియన్స్‌ కూడా ఇదే తరహాలో ట్రోఫీలు సొంతం చేసుకుంది. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ టైటిల్‌ను కైవసం చేసుకోవడంతో కోల్‌కతా, ముంబై ఇండియన్స్‌ జట్ల సరసన నిలిచింది.