కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా హెచ్.డి.కుమారస్వామి

  • 6 years ago
HDK to seek the trust vote on Friday. This will be preceded by the speaker’s election. full council of ministers will be sworn in on May 29. Designated CM HD Kumaraswamy’s oath taking ceremony to be held on today, May 23. KPCC president Dr. G. Parameshwar also taking oath along with Kumaraswamy.


కర్ణాటక ముఖ్యమంత్రిగా హెచ్.డి.కుమారస్వామి ప్రమాణస్వీకార కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా హెచ్.డి.కుమారస్వామి, ఉప ముఖ్యమంత్రిగా కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జి. పరమేశ్వర్ మాత్రమే బుధవారం ప్రమాణస్వీకారం చేస్తున్నారు. పూర్తి మంత్రి వర్గం ప్రమాణస్వీకారం చెయ్యడానికి వారం రోజులు (మే 29) గడువు విధించారు. అసమ్మతి దెబ్బతో వారం రోజులు సమయం తీసుకుంటున్నారని సమాచారం.
కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు ఎన్ని మంత్రి పదవులు పంచుకోవాలి అంటూ చర్చలు జరిపారు. కాంగ్రెస్ కు 20 మంత్రి పదవులు ఇవ్వాలని మొదట నిర్ణయించారు. ముఖ్యమంత్రితో పాటు 13 మంత్రి పదవులు, స్పీకర్ పదవి ఇవ్వాలని జేడీఎస్ డిమాండ్ చేసింది. అయితే చివరి నిమిషయంలో కుమారస్వామి కోరికకు కోత పడింది. కాంగ్రెస్ కు 22 మంత్రి పదవులు, జేడీఎస్ కు 12 మంత్రి పదవులు వస్తున్నాయి.

Category

🗞
News

Recommended