Allu Arjun Dinner Date With His Wife

  • 6 years ago
Allu Arjun Dinner Date With His Wife .Allu Arjun,as spotted last night at a popular eatery in Mumbai with wife Sneha Reddy. The two enjoyed a dinner date in Mumbai and were clicked while exiting from the restaurant. Both of them looked stunning together as they flaunted their casual look.
నా పేరు సూర్య' సినిమా షూటింగ్ సమయంలో చాలా రోజుల పాటు ఇంటికి దూరంగా గడిపిన అల్లు అర్జున్... సినిమా రిలీజ్ అవ్వడం, ప్రమోషన్స్ కూడా పూర్తవ్వడంతో ఫుల్ రిలాక్సింగ్ మూడ్‌లోకి వెళ్లిపోయారు. తన పూర్తి సమయాన్ని కుటుంబం కోసమే కేటాయించారు. తాజాగా బన్నీ తన భార్య స్నేహారెడ్డితో కలిసి ముంబైలో ప్రత్యేక్షమయ్యారు. డిన్నర్ డేట్ కోసమే ఈ జంట ముంబై వచ్చినట్లు తెలుస్తోంది. ముంబైలోని ఓ ఫేమస్ రెస్టారెంటు నుండి బయటకు వస్తుండగా ఇద్దరూ మీడియా కెమెరాలకు చిక్కారు.
ముంబై రెస్టారెంట్ నుండి అల్లు అర్జున్ తన భార్యతో బయటకు రాగానే అక్కడ ఉన్న మీడియా ఫోటోగ్రాఫర్ల అటెన్షన్ ఈ జంట వైపు మళ్లింది. బన్నీ నటించిన సినిమాలు హిందీలో కూడా డబ్ అయి విడుదలవుతుండటం వల్ల అక్కడ కూడా బన్నీకి పాపులారిటీ పెరుగుతుంది అనడానికి ఇదొక నిదర్శనం.
హైదరాబాద్‌లో డిన్నర్ డేట్ వెళదామంటే ఏ హోటల్ వెళ్లినా, ఏ రెస్టారెంట్ వెళ్లినా..... అభిమానుల చుట్టూ చేరి హడావుడి చేస్తుంటారు. ప్రైవసీ కోసమే బన్నీ తన భార్యతో కలిసి ముంబైకి డిన్నర్ డేట్ వెళ్లినట్లు తెలుస్తోంది.
#naa peru surya
#Allu Arjun
#Sneha Reddy

Recommended