IPL 2018: Bowlers Are Better Than Batsmen

  • 6 years ago
New Zealand fast bowler Trent Boult has carried his international form in the IPL by ripping apart batting line-ups with an abundance of swing.

ఐపీఎల్ యువ క్రికెటర్లకు అవకాశాల గని అని మరోసారి రుజువైంది. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 11వ సీజన్‌లో లెగ్‌ స్పిన్నర్లు, మణికట్టు స్పిన్నర్లు ఎక్కువ ప్రభావం చూపుతున్నారని టీమిండియా మాజీ క్రికెటర్ వెంకటపతి రాజు అన్నారు.
'స్టార్‌ మా' ఛానెల్‌లో ప్రసారమవుతున్న ఐపీఎల్‌లో తెలుగు కామెంటేటర్‌గా వెంకటపతి రాజు తన రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో ఆయన మాట్లాడుతూ 'ఐపీఎల్‌ తుది దశకు చేరుకుంది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ అద్భుతంగా ఆడుతున్నాయి' అని అన్నారు.
'ప్లే ఆఫ్స్ దగ్గర పడుతున్న సమయంలో ఏయే జట్లు నాకౌట్ దశకు చేరుకుంటాయో ఆసక్తికరంగా మారింది. ఢిల్లీ, బెంగళూరు.. ఇతర జట్ల అవకాశాల్ని దెబ్బతీయొచ్చు. ఒక బ్యాట్స్‌మన్‌ లేదా ఒక బౌలర్‌ ఫలితాన్ని తారుమారు చేస్తున్నారు. డెత్‌ బౌలింగ్‌ కీలకంగా మారింది. లెగ్‌ స్పిన్నర్లు, మణికట్టు స్పిన్నర్లు ముఖ్య భూమిక పోషిస్తున్నారు' అని తెలిపారు.
'ప్రస్తుత సీజన్‌లో బ్యాట్స్‌మెన్ల కంటే బౌలర్లు చక్కటి ప్రదర్శన కనబరుస్తున్నారు. నాలుగు ఓవర్లలో బౌలర్లు చాలా వైవిధ్యం చూపిస్తున్నారు. ఈ విషయంలో స్పిన్నర్లు ముందున్నారు. ఈ ఐపీఎల్‌లో అత్యంత వైవిధ్యమైన.. ప్రభావవంతమైన బౌలింగ్‌ సన్‌రైజర్స్‌దే. పేసర్లు లేకపోయినా.. భువీ, సిద్ధార్థ్‌ కౌల్‌, సందీప్‌శర్మలు వైవిధ్యమైన బంతులతో ఆకట్టుకుంటున్నారు' అని పేర్కొన్నారు.

Recommended