IPL 2018: SRH Crushed KXIP

  • 6 years ago
A spirited bowling effort from Sunrisers Hyderabad (SRH) handed them a second consecutive win in a low-scoring game as they edged an in-form Kings XI Punjab side by 13 runs in the Indian Premier League (IPL) 2018 encounter here on Thursday

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్‌కు ఎదురులేదని మరోసారి నిరూపించింది. ఉప్పల్ స్టేడియంలో గురువారం రాత్రి కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 13 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఈ మ్యాచ్ ‌టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్‌ జట్టు పంజాబ్కు 133 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో సన్‌రైజర్స్‌ బౌలర్లు చెలరేగిపోయారు. పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన పంజాబ్‌కు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు.
133 పరుగల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌ను 19.2 ఓవర్లలో 119 పరుగులకే కట్టడి చేసిన సన్‌రైజర్స్‌ మరో సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఫలితంగా కింగ్స్‌ పంజాబ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఎదురైన ఓటమికి సన్‌రైజర్స్‌ ప్రతీకారం తీర్చుకుంది.
సన్‌రైజర్స్ బౌలర్లు రషీద్‌ ఖాన్‌, షకిబ్ ఉల్ హాసన్‌లు కట్టుదిట్టమైన బంతులతో పంజాబ్ బ్యాట్స్‌మన్‌కు చుక‍్కలు చూపించారు.‍ ఛేదనలో పంజాబ్ ఓపెనర్లు కేఎల్ రాహుల్ (32) , క్రిస్‌గేల్ (23) నిలకడగా ఆడి జట్టుకి మెరుగైన ఆరంభమిచ్చినా.. మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ ఘోరంగా విఫలమయ్యారు.