Kotikokkadu Movie Review

  • 6 years ago
Kotikokkadu is a Telugu movie released on 9 Mar, 2018. The movie is directed by K.S. Ravikumar and featured Kicchaa Sudeep, Nithya Menen, prakash raj and Nasser as lead characters. Other popular actors who were roped in for Kotikokkadu are Nasser, Mukesh Tiwari, Delhi Ganesh, Sadhu Kokila and Sharath Lohitashwa.

కన్నడ నటుడు సుదీప్‌ 'ఈగ' సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. సుదీప్ నటించిన 'కోటిగొబ్బ-2' చిత్రం తమిళం, కన్నడలో విడుదలైన అక్కడ మంచి విజయం సాధించింది. రెండు భాషల్లో మంచి విజయం సాధించడంతో ఈ చిత్రాన్ని తెలుగులో 'కోటికొక్కడు' పేరుతో అనువాదం చేసి విడుదల చేశారు. ఈ చిత్రం విశేషాలు ఏమిటో రివ్యూలో చూద్దాం....

సత్యం (సుదీప్) రియల్‌ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు. మంచి పనులు చేస్తూ మంచి వాడిగా గుర్తింపు తెచ్చుకుంటాడు. సత్యంలో ఎవరికీ తెలియని మరోకోణం దొంగతనాలు, దోపీడీలు. శివం పేరుతో బడాబాబుల వద్ద మూలుగుతున్న వందలకోట్ల నల్లధాన్ని దోచేస్తూ ఉంటాడు. అయితే బయటి ప్రపంచాన్ని తాము ఇద్దరం అని..... తన అన్నయ్య శివం దొంగతనాలు, దోపిడీలు చేస్తూ తనకు తలవంపులు తెస్తున్నాడని నమ్మిస్తూ ఉంటాడు. సత్యం, శివం ఇద్దరు కాదు... ఒకడే అని నిరూపించేందుకు అసిస్టెంట్ కమీషనర్(రవిశంకర్) ప్రయత్నిస్తుంటాడు. మరి సత్యం ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు? ఆ డబ్బంతా ఏం చేస్తున్నాడు? అనేది మిగతా కథ.

Recommended