• 6 years ago
Senior actor and director Giribabu is well known for the Telugu film audience.As a character artist and villain he has acted in hundreds of films.He has worked as a writer and director for some films.giribabu made an intresting comments on mega star chiranjivi and jr.ntr in an Interview.
#giribabu
#jrntr
#chiranjeevi
#maheshbabu
#tollywood
#trivikramsrinivas
#prabhas
#alluarjun
#ramcharan

సీనియర్ నటుడు, దర్శకుడు గిరిబాబు తెలుగు సినీ ప్రేక్షకులందరికీ సుపరిచయమే. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా వందల చిత్రాల్లో నటించారు. కొన్ని చిత్రాలకు రచయితగా, దర్శకుడిగా కూడా పనిచేశారు. ఇప్పటికీ అయన నటుడిగా రాణిస్తున్నారు. తాజాగా గిరిబాబు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇప్పటి హీరోలు పోటీ పడుతూ రాణిస్తున్నారని వ్యాఖ్యానించారు. పాత రోజుల్లో చిరంజీవితో తలెత్తిన విభేదాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుతం టాలీవుడ్ హీరోలు ఒకళ్ళని మించి ఒకళ్ళు రాణిస్తున్నారని గిరిబాబు అన్నారు. ఒక హీరోకి ఎక్కువ హిట్లు, మరో హీరోకి తక్కువ హిట్లు ఉండొచ్చు. అది కథలని బట్టి, దర్శకులని బట్టి ఉంటుంది. కానీ నటన, డాన్సులు , ఫైట్స్ విషయంలో ఇప్పుడున్న స్టార్ హీరోలంతా అద్భుతంగా రాణిస్తున్నారు అని గిరిబాబు అన్నారు. ఇక హీరోయిన్లు మాత్రం అందరూ ఉత్తరాది నుంచి దిగుమతి అవుతున్న వాళ్లే ఉన్నారని గిరిబాబు వ్యాఖ్యానించారు.ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలు మహేష్ బాబు, అల్లు అర్జున్, రాంచరణ్, ప్రభాస్, జూ. ఎన్టీఆర్ గురించి గిరిబాబు ప్రస్తావించారు. జూ. ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ.. వాడు మామూలోడు కాదు కదా.. అద్భుతమైన ఆర్టిస్టు అని సరదాగా వ్యాఖ్యానించారు. కానీ తాను ఇంతవరకు జూ. ఎన్టీఆర్ చిత్రంలో నటించలేదని అన్నారు. ఇక మహేష్ బాబుతో చిన్నప్పటి నుంచి నటిస్తున్నానని తెలిపారు.

Category

People

Recommended