The AP government says that all the major irrigation projects in the state will be completed this year. But according to the allocation of the present budget, AP government statements do not appear to be fulfilled.
రాష్ట్రంలో చేపట్టిన ప్రతి సాగునీటి ప్రాజెక్టును ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తామని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటిస్తున్నా...ఆచరణలో తాజా బడ్జెట్ కేటాయింపులను బట్టి అవి సకాలంలో పూర్తికావడం అసాధ్యమేనని సుస్పష్టం.
ప్రస్తుత 2018-19 సంవత్సరానికి సాగునీటి ప్రాజెక్టులకు 16,978.23 కోట్లు కేటాయించాం. గత సంవత్సరం కన్నా ఇది 32 శాతం ఎక్కువ...ఇవీ బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు సాగునీటి ప్రాజెక్టుల గురించి చెప్పిన మాటలు. అయితే కాగితాలపై ఈ కేటాయింపులు ఘనంగా ఉన్న మాట వాస్తవమే...కానీ విశ్లేషించి చూస్తే నిజంగా జలవనరులశాఖకు దక్కింది మాత్రం నామమాత్రం కేటాయింపులే.
తాజా బడ్జెట్ లో 16,978.23 కోట్ల రూపాయల కేటాయింపుల్లో ఒక్క పోలవరం ప్రాజెక్టుకు కేటాయించిన మొత్తం రూ. 9,994 కోట్లు. దానికి పోగా మిగిలింది రూ. 6 వేల కోట్లు మాత్రమే. మరి వీటితో ఎన్ని మిగతా ప్రధాన ప్రాజెక్టులను పూర్తి చేస్తారు....ఎలా చేస్తారు?......ప్రాక్టికల్ గా ఆలోచిస్తే ఈ నిధులతో అన్ని ప్రధాన ప్రాజెక్టులు పూర్తి చేయడం అసాధ్యం.

Category
🗞
News