A post in social media is doing rounds saying Lagadapati Rajagopal's survey, predicts big win for YS Jagan's YSR Congress in coming elections
ఓ సర్వే సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ చేయించిన సర్వే అంటూ దాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. లగడపాటి చేయించిన సర్వేలకు విశ్వసనీయత ఉంటుందనే విషయం అందరికీ తెలుసు. ఆయన చేయించి సర్వే అంచనా ఫలితాలకు చాలా దగ్గరగా ఉంటాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండు ప్రైవేట్ సంస్థలతో సర్వేలు చేయించారని, తెలుగుదేశం పార్టీ బంపర్ మెజారిటీతో విజయం సాధిస్తుందని ఆ సర్వేల్లో తేలిందని వార్తలు వచ్చాయి. దానికి కౌంటర్‌గా లగడపాటి సర్వే అంటూ దీన్ని ప్రచారంలోకి తెచ్చారా తెలియదు. ఇది నిజమని పూర్తిగా నమ్మడానికి కూడా వీలు లేదు. సోషల్ మీడియాలో హచ్‌చల్ చేస్తోంది కాబట్టి చర్చనీయాంశంగా మారింది.
వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనేది కూడా అందులో ఉంది. జిల్లాలవారీగా తెలుగుదేశం, వైసిపి, జనసేన గెలుచుకునే సీట్ల సంఖ్యను కూడా ఇచ్చారు. జగన్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ 105 స్థానాలు, తెలుగుదేశం 51 స్థానాలు, పవన్ కల్యాణ్ జనసేన 19 స్థానాలు గెలుచుకుంటాయని అందులో చెప్పారు. రాష్ట్రంలో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఈ రకంగా పవన్ కల్యాణ్ మూడో స్థానంలోనే ఉంటారని చెబుతున్నారు.
శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ స్థానాలున్నాయి. వాటిలో తెలుగుదేశం 4, వైయయస్సార్ కాంగ్రెసు పార్టీ 5, జనసేన 1 సీట్లు గెలుచుకుంటాయని లగడపాటి సర్వే తేల్చిందంటూ ఓ పోస్టులో చెప్పారు

Category
🗞
News