• 7 years ago
AP CM Chandrababu on Tuesday launched the video conferencing facility from Davos for the tribals living in Rampachodavaram Agency of Jajivalasa village in East Godavari district.


అది ఆంధ్రప్రదేశ్ లోని ఓ మారుమూల గ్రామం...కొండలు...కోనల మధ్య ఉండే ఆ గ్రామానికి ఈ మధ్య కాలంలో ఫోను సదుపాయం కూడా లేదు...ఇక ఇంటర్‌నెట్‌ అంటే ఆ వూళ్లో దాదాపుగా ఎవరికీ తెలియదు...అలాంటి గిరిజన ప్రాంతంలోకి ఒకరు ఫోన్ తీసుకొచ్చి ఓ వ్యక్తికి ఇచ్చి మీకు కాల్ వచ్చింది...సార్ మాట్లాడతారని ఫోన్ చేతికి ఇచ్చారు...అది వీడియోకాల్...ఆ ఫోన్ మాట్లాడే వ్యక్తిని చూస్తూ.. ఆయన మాటలు వింటూనే ఆ వూరి వారందరూ షాక్ అయ్యారు....కారణం...
ఆ వీడియో కాల్ లోని వ్యక్తి తమకు బాగా తెలిసినవారే...ఆయన ఇలా మాట్లాడుతున్నారు...''బ్రదర్‌... నేను నారా చంద్రబాబు నాయుడిని... మీ ముఖ్యమంత్రిని... దావోస్‌ నుంచి మాట్లాడుతున్నాను...ఎలా ఉన్నారు?'' అని అడిగారు!...ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబే తమ యోగక్షేమాలు కనుక్కోవడం, అందులోనూ దావోస్‌ నుంచి మాట్లాడుతున్నానని చెప్పడంతో స్థానికులు అవాక్కైపోయారు...ఆ తరువాత తేరుకొని సంబరాలు జరుపుకున్నారు... సో...ఆ వీడియో కాల్ చేసింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు...ఆయన కాల్ చేసింది దావోస్ నుంచి...ఆ వూరు జాజివలస...
రంపచోడవరానికి దాదాపు 80 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ మారుమూలపల్లెకు ఈ విధంగాతొలిసారిగా ఫోను, ఇంటర్నెట్‌, కేబుల్‌టీవీ సదుపాయాలు ఒకేసారి పలకరించాయి. ఆంధ్రప్రదేశ్‌ ఫైబర్‌నెట్‌ సంస్థ ఈ మారుమూలనున్న గిరిజన గ్రామానికి సాధారణ జనంతో మమేకమయ్యేలా కనెక్టివిటీ కల్పించింది

Category

🗞
News

Recommended