రాజేష్ మగాడంటే నమ్మేదే లేదు.. తొలిరాత్రే చెప్పాడు..!

  • 6 years ago
Sadist husband Rajesh talks to media after being released from the jail on bail who was accused by her wife for saying he is not fit for a marital life. He said will give his support for the further case investigation and said the allegations against him are false.

తొలి రాత్రి రోజే కట్టుకున్న భార్యను చిత్రహింసలకు గురిచేసిన రాజేష్ బెయిల్‌పై విడుదలయ్యాడు. అంతేగాక, తాను ఏ తప్పు చేయలేదంటూ చెబుతున్నాడు. తనపై లేని పోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డాడు.
గంగాధర నెల్లూరు మండలం మోతరంగనపల్లికి చెందిన రాజేష్‌కి నవంబర్‌ 1న దామరగుంటకు చెందిన శైలజతో పెళ్లైంది. కాగా, తొలిరాత్రి నాడే భార్య శైలజపై తీవ్రంగా దాడిచేశాడు. ఈ నేపథ్యంలోనే పోలీసులు అతడిని అరెస్ట్‌ చేసి కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
కాగా, జైలు నుంచి బెయిల్‌పై శుక్రవారం విడుదలైన సందర్భంగా రాజేష్ మీడియాతో మాట్లాడాడు. ‘ఒకటి కాదు రెండు కాదు.. దాదాపు 45 రోజుల పాటు నా కన్నతల్లిని చూడకుండా చేశారు. పైగా నేను మగాడ్ని కాదంటూ, సంసారానికి పనికిరాడని నాపై అభాండాలు వేశారు. నేను మగాడ్నే. మెడికల్‌ బోర్డు కూడా నా లైంగిక పటుత్వ పరీక్షలు పరీక్షించి ఎలాంటి లోపం లేదని నివేదిక ఇచ్చింది.' అని పేర్కొన్నాడు. తన నిర్దోషిత్వంపై న్యాయ పోరాటం చేసి నిరూపించుకుంటాననని రాజేష్ చెప్పాడు. పోలీసుల దర్యాప్తునకు తాను పూర్తిగా సహకరిస్తానన్నాడు. శైలజ తనపై చేసిన ఆరోపణలన్నీ అబద్దమన్నాడు. తనను శాడిస్ట్‌తో పోల్చొద్దంటూ కోరాడు.
ఇదిలా ఉండగా..రాజేష్ పటుత్వ పరీక్షల్లో నెగ్గడంతో కేసు పరిష్కారమైనట్లు కాదని శైలజ తల్లిదండ్రులు అంటున్నారు. డాక్టర్లు నివేదికలు ఇచ్చినంత మాత్రాన తాము నమ్మబోమని ఆయన అన్నారు.
తనకు లైంగిక పటుత్వం లేదని బయట చెప్పవద్దని శైలజతో రాజేష్ వాగ్దానం చేయించుకున్నాడని మునికృష్ణా రెడ్డి అన్నారు.

Category

🗞
News

Recommended