అజ్ఞాతవాసి నిజంగా పవన్ ఆఖరి సినిమా నా ?

  • 7 years ago
In an interview Dil Raju very clearly said that Pawan Kalyan promised to him to do a movie, but recently Pawan Kalyan announced that Trivikram's movie is his last one, both comments were confusing fans now.

సినిమా-రాజకీయం రెండింటిని ఏక కాలంలో బ్యాలెన్స్ చేయాలనుకోవడం కష్ట సాధ్యమే. క్రియాశీలక రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటున్న పవన్ కల్యాణ్‌ అటు సినిమా, ఇటు రాజకీయం.. రెండింటిలో ఎటూ తేల్చుకోలేక చాన్నాళ్లు సతమతమయ్యారు.
పార్ట్ టైమ్ రాజకీయాలు పనికిరావన్న విమర్శలు పెరిగిపోవడంతో రెండు పడవల ప్రయాణానికి స్వస్తి చెప్పాలని ఆయన భావించారు. ఈ క్రమంలోనే అజ్ఞాతవాసి తన ఆఖరి సినిమా అని ప్రకటించేశారు కూడా. ఇలాంటి తరుణంలో నిర్మాత దిల్ రాజు చేసిన ఓ వ్యాఖ్య పవన్ వైఖరిపై సందేహాలను లేవనెత్తేలా మారింది.
సోమవారం దిల్ రాజు పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ఆయన పలు విషయాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ విషయాన్ని కూడా ప్రస్తావించారు. 'రాజూ.. నీతో సినిమాకు నేనెప్పుడైనా రెడీ.. నా రాజకీయాలతో అనవసరం..' అని పవన్ మాట ఇచ్చినట్లు చెప్పారు.
దిల్ రాజు చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే.. అజ్జాతవాసి తన ఆఖరి సినిమా అని పవన్ కల్యాణ్ చేసిన ప్రకటన వట్టిదేనా? అన్న సందేహాం తలెత్తకమానదు.
పవన్ కల్యాణ్ గతంలోను చాలామంది నిర్మాతలకు మాట ఇచ్చారు. దివంగత దర్శక రత్న దాసరి నారాయణరావుతోను, ఎం.ఎం.రత్నం లాంటి నిర్మాతలతోనూ సినిమాలు చేస్తానన్నారు. అయితే ఆ వాగ్దానాలన్ని ఆచరణ రూపం మాత్రం దాల్చలేదు. కాబట్టి దిల్ రాజుకు పవన్ ఇచ్చిన మాట కూడా అలాగే కనుమరుగువుతుందా? అన్నది కూడా చెప్పలేం.

Recommended