నా సినిమా పైరసీలో చూడు, కానీ ఒక పని చెయ్..!

  • 7 years ago
"Wait for a month till the movie will be available on Amazon Prime video for online streaming. If that is impossible download the pirated copy and donate $10 to a needy family. I will be happy and you wil be too." suggested S.R.Prabhu

ఒక సినిమా పైరసీ లో వచ్చిందీ అంటే ఆ నిర్మాత ఫీలింగ్ ఎలా ఉంటుందో తెలిసిందే కదా. ఎన్ని రకాల కట్టడి చేసినా ఈ పైరసీని మాత్రం ఆపలేకపోతున్నారు. వందలకోట్ల రూపాయల వ్యాపారం కేవలం సినిమాల పైరసీమీదే ఆధారపడి ఉన్నదన్నది కాదనలేని నిజం. ఒకపక్క సినిమా రిలీజ్ అయ్యీ అవకుండానే అటు రకరకాల వెబ్సైట్లలో ఈ సినిమాల ఒరింటులు కనిపిస్తున్నాయి. అయితే అందరు నిర్మాతలూ ఏమో గానీ తమిళ నిర్మాత ఎస్.ఆర్ ప్రభు మాత్రం ఒక అభిమానికి తానే నా సినిమాని పైరసీలో చూడు అంటూ సలహా ఇచ్చాడు...
ఆయన చూడమన్నది తన నిర్మాణంలో తెరకెక్కిన ‘ధీరన్ అధికారం ఒండ్రు' సినిమాను. ఈ చిత్రం తెలుగులో ‘ఖాకి' పేరుతో రిలీజైంది.
కార్తి-రకుల్ ప్రీత్ జంటగా వినోద్ దర్శకత్వంలో రూపొందిన ఈ పోలీస్ యాక్షన్ థ్రిల్లర్ రెండు భాషల్లోనూ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. మంచి వసూళ్లు సాధిస్తోంది. ఇప్పటికైతే అటు తమిళ, ఇటు తెలుగు రెండు ప్రాంతాల్లోనూ మంచి టాక్‌నే సంపాదించుకొని నిలకడగా ఉంది.
ఐతే ఓ విదేశీ అభిమాని.. తమ దగ్గర ‘ధీరన్ అధికారం ఒండ్రు' రిలీజవ్వలేదని.. మరి తాము సినిమా ఎలా చూడాలని నిర్మాత ప్రభును సోషల్ మీడియాలో ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకి ప్రభు స్పందన మాత్రం సూపర్ గా ఉంది, నా సినిమా పైరసీ వెర్షన్ చూసినా తనకేం అభ్యంతరం లేదన్నట్టు చెప్పాడు.