ఆ సినిమా తర్వాత.. నా గర్ల్‌ఫ్రెండ్‌తో ఎప్పుడూ గొడవలే !

  • 7 years ago
Vijay Devarakonda said that he faced lot of problems with his girl friend after Arjun Reddy movie release, he appeared as a romantic and aggressive youth in that film.

తన బాయ్ ఫ్రెండ్ మరో అమ్మాయితో క్లోజ్‌గా ఉంటున్నాడంటే.. ఏ అమ్మాయికైనా చిర్రెత్తుకురావడం కామన్. ఇక విషయం ముద్దుల దాకా వెళ్లినట్లు తెలిసిందంటే.. గర్ల్ ఫ్రెండ్ ప్రకోపానికి బలైపోవాల్సిందే.
పాపం.. మన విజయ్ దేవరకొండ కూడా ఇలాగే బలైపోయాడట. అలా అని ఇదేమి నిజంగా ఎఫైర్ కాదండోయ్. ఆన్ స్క్రీన్ రొమాన్స్‌కే తన గర్ల్ ఫ్రెండ్ గగ్గోలు పెట్టిందని చెబుతున్నాడు.
'అర్జున్ రెడ్డి సినిమా చేశాక నా గర్ల్‌ఫ్రెండ్‌తో ఎప్పుడూ గొడవలే. అందుకే ఆ సినిమా నాకు చాలా కష్టంగా అనిపించింది.' అని విజయ్ దేవరకొండ తన తాజా ఇంటర్వ్యూలో చెప్పారు.
అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డమ్ అందుకున్నప్పటికీ.. గర్ల్ ఫ్రెండ్‌తో గొడవలు మాత్రం నైట్ మేర్‌ను తలపించాయనేలా ఉన్నాయి విజయ్ మాటలు.
ప్రస్తుతం తాను 'ఏ మంత్రంవేశావె'తో పాటు 'ట్యాక్సీవాలా', 'మహానటి' చిత్రాల్లో నటిస్తున్నట్లు విజయ్ తెలిపారు. ట్యాక్సీవాలా సినిమా సూపర్‌ నేచురల్‌ థ్రిల్లర్‌ అని చెప్పారు. ఇందులో క్యాబ్ డ్రైవర్‌గా నటిస్తున్నానని, ఈ సినిమా వచ్చాక తనలోని అర్జున్ రెడ్డిని మరిచిపోతారని విజయ్ పేర్కొనడం గమనార్హం.
ఇక 'మహానటి' చిత్రంలో తన పాత్రపై క్లారిటీ ఇచ్చారు విజయ్. అందరూ అనుకుంటున్నట్లు తాను ఎంజీఆర్‌ పాత్రలో కానీ ఎన్టీఆర్‌ పాత్రలో కానీ నటించడం లేదన్నారు. తాను, సమంత ఇద్దరం జర్నలిస్టు పాత్రల్లో నటిస్తున్నట్లు తెలిపారు. అయితే తన పాత్ర చిన్నదే అయినప్పటికీ.. ఒక గొప్ప నటి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తున్నారు కాబట్టి ఎలాంటి పాత్ర అయిన ఫర్వాలేదన్నారు విజయ్..

Recommended