ఫ్యూచర్-రిలయెన్స్‌తో జట్టు అందుకే ! విలేజ్ మాల్స్‌ నో యూజ్ ? | Oneindia Telugu

  • 7 years ago
YSR Congress MLA Roja lashes out at Chandrababu Naidu for Chandranna Village Malls.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ రిటైల్ గ్రూప్స్‌ను తన వాళ్లకు ఇచ్చుకుంటున్నారని వైసీపీ ఎమ్మెల్యే రోజా బుధవారం మండిపడ్డారు. పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు.. ఓటు వేసిన ప్రజలకు వెన్నుపోటు పొడవడు అంటే ఎలా నమ్ముతామని వ్యాఖ్యానించారు. నీ కుటుంబానికి వాటాలు ఉన్నాయని రిలయెన్స్, ఫ్యూచర్ గ్రూప్‌లకు ప్రభుత్వ రిటైల్ సంస్థలను ఇస్తే ప్రజలు, వైసీపీ కలిసి తరిమితరిమి కొడుతాయని ఆమె హెచ్చరించారు. సీఎం పదవిని అడ్డు పెట్టుకొని చంద్రబాబు దోచుకుంటున్నారని ఆరోపించారు. చంద్రబాబు చేసే ప్రతీది స్వలాభమే అన్నారు.
ఫ్యూచర్, రిలయెన్స్ గ్రూప్ తక్కువ ధరకు ఇవ్వబోయేది నిజమే అయితే ప్రధాని మోడీ దేశం మొత్తం ఇవ్వమంటే ఇస్తారా అని ప్రశ్నించారు. మేం పాలు, కూరగాయలు అమ్ముకొని బతుకుతుంటామని చంద్రబాబు అంటుంటారని రోజా ఎద్దేవా చేశారు. సూటుకేసుల కోసమే చంద్రబాబు పనులు చేస్తున్నారన్నారు.