CM Chandrababu Laid Foundation Stone For His Own Housein Amaravati : ప్రజారాజధాని అమరావతిలో సొంతింటి నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. చంద్రబాబు, భువనేశ్వరి, లోకేశ్, బ్రాహ్మణి, దేవాన్ష్‌లు పూజా కార్యక్రమం నిర్వహించారు. వెలగపూడి సచివాలయం వెనక E9 రహదారి పక్కనే ఇంటి నిర్మాణం చేపట్టారు. గతేడాది డిసెంబరులో వెలగపూడి రెవెన్యూ పరిధిలో 5 ఎకరాల విస్తీర్ణంలోని నివాస ప్లాట్‌ను అదే గ్రామానికి చెందిన రైతు కుటుంబం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబసభ్యులు కొనుగోలు చేశారు. ఇటీవలే ప్లాట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తైంది. జీ ప్లస్ వన్ మోడల్లో సొంతింటి నిర్మాణానికి సీఎం శ్రీకారం చుట్టారు. ఏడాదిలోపే నిర్మాణం పూర్తి చేసి గృహప్రవేశం చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇంటి నిర్మాణ ప్లాన్‌ను లోకేశ్ కుటుంబసభ్యులకు వివరించారు.
Category
🗞
NewsTranscript
00:00Thank you for joining us.