• last month
Lifeguards Saved Drowning Person in Vishaka RK Beach : విశాఖ ఆర్కే బీచ్​లో సముద్రస్నానం చేసేందుకు వచ్చి నీటిలో మునిగిపోతున్న వ్యక్తిని లైఫ్ గార్డ్ లు కాపాడారు. రాసపువానిపాలెంకు చెందిన ఆటో డ్రైవర్ నూకరాజు శివరాత్రి సందర్భంగా కుటుంబసభ్యులతో కలిసి సముద్ర స్నానానికి వచ్చారు. స్నానం చేస్తుండగా సముద్రపు అలలు నూకరాజును సముద్రంలోకి లాక్కెళ్లాయి. స్పందించిన లైఫ్ గార్డ్ లు వెంటనే సముద్రంలోకి పడవలతో వెళ్లి బాధితుడిని కాపాడి ప్రథమ చికిత్స చేశారు. ప్రస్తుతం నూకరాజు ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉంది.

Category

🗞
News

Recommended